Translate

Saturday, 20 September 2014

సోలార్ ఇల్లే... సో బెటరు..



- ఇకపై విద్యుత్ పొదుపు తప్పనిసరి
- భవనాల డిజైన్లలో సమూల మార్పులు
- సోలార్ ప్యానెళ్లు మస్ట్...
- అలాంటి వాటికే జీహెచ్‌ఎంసీ అనుమతులు
- త్వరలో అమల్లోకి ఈసీబీసీ నిబంధనలు
- తొలుత కమర్షియల్ భవనాలపై ప్రయోగం

సిటీబ్యూరో, టీ మీడియా: భవనాల డిజైన్‌లో సమూల మార్పులు రానున్నాయి. గోడలు, పై కప్పు దగ్గర్నుంచి అందులో ఏర్పాటు చేసే విద్యుత్ ఉపకరణాల వరకు అన్నీ మారనున్నాయి. విద్యుత్‌ను ఆదాచేసే ఉద్దేశంతో రూపొందించిన ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. దీనిద్వారా కనీసం 40నుంచి 50శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అంచనా. స్మార్ట్‌సిటీలపై శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామాత్యులు కే. తారక రామారావు మాట్లాడుతూ, ప్రతి భవనానికీ ఇక సోలార్ ప్యానళ్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తామని ప్రకటించడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.


విద్యుత్ కొరతను అధిగమించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2007లో ఈసీబీసీ నిబంధనలకు రూపకల్పన జరిగింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ)తోపాటు నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్లు, సాంకేతిక విద్యా సంస్థలు, కన్సల్టెంట్ల సలహామేరకు వీటిని తయారుచేశారు. ఈ నిబంధనల ప్రకారం ఇళ్ల గోడలు, పై కప్పు(రూఫ్ టాప్)లకు వాడే మెటీరియల్‌తోపాటు, కిటికీలు, విద్యుత్ ఉపకరణాల ఏర్పాటుకు కొన్ని స్పష్టమైన నిబంధనలున్నాయి. అంతేకాకుండా వేడినీరు, నీటి పంపింగ్ కోసం తప్పనిసరిగా సోలార్ విద్యుత్‌ను వాడాలనే నిబంధన ఉంది. ముఖ్యంగా 1000చ.మీ.ల ప్లాటు వైశాల్యం, లేక 2000చ.మీ.ల బిల్టప్ ఏరియా ఉండే అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్‌కు ఈబీసీసీని తప్పని సరిగా అమలు చేయాల్సి ఉంటుంది. మామూలు భవనాలతో పోల్చుకుంటే వీటి నిర్మాణ వ్యయం10-15శాతం వరకు అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకూ ఇవి ఏ నగరంలోనూ పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు 2012నుంచి మన రాష్ట్రంలో అమలుచేయాలని నిర్ణయించారు. ఇం దులో భాగంగా ముందు కమర్షియల్ భవనాలు, గ్రూప్ హౌసింగ్, ఆస్పత్రులు, హోటళ్లు తదితరవాటికి తప్పనిసరి చేయాలని నిర్ణయించారు.

అయితే ఇంతవరకూ అది అమలుకు నోచుకోలేదు. నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు అలా చేయకుండా సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చును బ్యాంకు గ్యారంటీ తీసుకొని భవనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్కిటెక్ట్స్, లైసెన్స్ ఇంజినీర్లకు ఈ నిబంధనలపై శిక్షణనిప్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రభుత్వ భవనాలకు వీటి ప్రకారం నిర్మించాలని భావించినప్పటికీ అప్పటి సీమాంధ్ర పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల ఉదాసీన వైఖరి వల్ల సాధ్యం కాలేదు. తాజాగా, ఇళ్లకు సోలార్ ప్యానళ్లను తప్పనిసరి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా మళ్లీ ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇకనుంచి సోలార్ ప్యానళ్ల ఏర్పాటే కాకుండా ఈసీబీసి నిబంధల ప్రకారం డిజైన్ చేసిన భవనాలకే అనుమతులు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఈబీసీ నిబంధనల్లోని ముఖ్యాంశాలు..

No comments:

Post a Comment