హైదరాబాద్ సిటీ
పోలీసులు కమ్యూనికేషన్ సిస్టమ్‌తో నేరాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు.
సెల్‌ఫోన్‌లో వాట్సాప్, గ్రూప్ మెస్సేజ్‌లతో సమాచార సేకరణ, చేరవేతలతో
క్రైమ్‌ను కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి సిబ్బందికి
శిక్షణ ఇప్పించాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి భావిస్తున్నారు. ఇంత కాలం
మ్యాన్‌ప్యాక్ (వైర్‌లెస్ సెట్)పై ఆధారపడగా, రహస్య సమాచారం చేరవేసేప్పుడు
మాత్రం నేరుగా సంప్రదించేవారు. దీన్నించి అప్‌డేట్ కావాలని ఒకే సమయంలో
ఎక్కువ మందికి మెస్సేజ్‌లు పంపడానికి వాట్సాప్‌ను ఉపయోగించాలని నిర్ణయానికి
వచ్చారు. అధికారుల గ్రూపు, టీమ్ గ్రూపు, స్టేషన్ సిబ్బంది గ్రూపు నమోదు
చేసుకొని ఆ దిశగా ముందుకు కదలాలలనుకుంటున్నారు. త్వరలో కానిస్టేబుల్ నుంచి
సీపీ వరకు పోలీసు గ్రూప్ సిమ్‌లు ఇవ్వడానికి కమిషనర్ సిద్ధమవుతున్నారు.
No comments:
Post a Comment